calender_icon.png 4 December, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లర్లు చేస్తే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ తప్పదు

04-12-2025 01:24:30 PM

బెల్లంపల్లి లోఅర్ధరాత్రి డీసీసీ భాస్కర్ ఆకస్మిక పర్యటన 

పాత నేరస్తుల ఇళ్ల తనిఖీ, కౌన్సిలింగ్

బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గ్రామoలో మంచిర్యాల డీసీసీ భాస్కర్  ఆకస్మికంగా పర్యటించారు. బుధవారం అర్థ రాత్రి  ఆయన  రౌడీషీటర్లతో మాట్లాడారు. ఎన్నికల వేళ అసాంఘిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డీసీసీ ఏ భాస్కర్ హెచ్చరించారు. ప్రజా జీవనానికి విఘాతం కలిగించే వారినీ సహించమన్నారు. తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలో నేరప్రవృత్తి కలిగిన రౌడీషీటర్ల ఇండ్లను డీసీపీ ఆకస్మిక తనిఖీ చేసి వారి కదలికల వివరాల పై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారికి కౌన్సిలింగ్ చేశారు.

రానున్న గ్రామపంచాయతీ ఎలక్షన్స్ లో ఎలాంటి అల్లర్లు చేయకుండా సత్ప్రవర్తన దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఎటువంటి గొడవలు చేయవద్దని, ఒకవేళ ఎవరైనా గొడవలు చేసినట్లయితే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరిపై నిఘా ఏర్పాటు చేశామని, ఏ చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులను కట్టడి చేసేందుకు మంచిర్యాల జోన్ పోలీసు కార్యాచరణ రూపొందించి, నట్లు చెప్పారు. పాత నేరస్తులపై నిఘా పెంచి అన్ని కోణాల్లో దృష్టి సారించిందనన్నారు. ఇప్పటికే జిల్లాలో గత ఎన్నికల కేసుల్లో గొడవల్లో ఉన్న పాత నేరస్థులు, రౌడీ షీటర్స్ లను బైండోవర్ చేసి మళ్ళీ ఇతర నేరాలకు పాల్పడకుండా వారి కదలికల పై నిఘా ఉంచామని అన్నారు. ఎవరైన బైండోవర్ ఉల్లంఘించి గొడవలకు గాని ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనన్నారు. డీసీపీ వెంట బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ. హెచ్ హనొక్, తాళ్ల గురజాల ఎస్సై బి రామకృష్ణ ఉన్నారు.