48 గంటల దీక్షకు ముగింపు
జనగామ, ఆగస్టు 22 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనగామ, డీసీసీ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ కంచరాములు గత 48 గంటలుగా చేపట్టిన నిరాహార దీక్షను డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి విరమింపజేశారు. ఈ సందర్భంగా లకావత్ ధనవంతి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు తావు లేదు. పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలి. వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బంది పెట్టడం సరికాదు. కార్యకర్తల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన పార్టీని బలోపేతం చేయడమే మన లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి టెంపుల్ మెంబెర్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వేముల సత్యనారాయణ రెడ్డి, జాయ మల్లేష్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు , మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






