21-02-2026 02:42:37 PM
హైదరాబాద్: కాసేపట్లో వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం(DCC Presidents Training Classes) ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను ప్రారంభించనున్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ జిల్లా అధ్యక్షులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శనివారం నుంచి మార్చి 2తేదీ వరకు శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. శిక్షణ తరగతుల కార్యక్రమాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాందీ, కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.