దురవిద్య ప్రవేశాలకు గడువు పొడిగింపు
16-09-2026 | 06:24pm
నాగల్‌గిద్ద, సెప్టెంబరు 16: టాస్ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు నాగల్‌గిద్ద మండల కోఆర్డినేటర్ జాదవ్ మారుతి(Mandal Coordinator Jadhav Maruti) తెలిపారు. నిర్ణీత ఫీజుతో సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.