15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడగింపు

07-02-2026 04:17 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని మైనారిటీస్ విద్యార్థినీ, విద్యార్థులకు, కళాశాల యాజమాన్యాలకు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి ఎంఎ అబ్దుల్ నదీమ్ ఖుద్దుసి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ (ఫ్రెష్ & రెన్యువల్) స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునే గడువును మార్చి 31, 2026 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.

అర్హులైన మైనారిటీస్ విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే కళాశాల యాజమాన్యాలు EPASS నమోదుపై ప్రత్యేక చొరవ చూపి, దరఖాస్తుల ప్రక్రియను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.