25 June, 2026 | 3:23 PM

Breaking News

మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్   •   తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.   •   దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం   •   ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి   •   విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు   •   నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి   •   కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు   •   పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు   •   చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు   •  

శివన్నగూడ గ్రామపంచాయతీని ప్రగతి పథంలో తీర్చి దిద్దడమే నా ధ్యేయం

07-02-2026 04:21 PM

సర్పంచ్ రాపోల్ యాదగిరి

మర్రిగూడ,(విజయక్రాంతి): శివన్నగూడ గ్రామాన్ని ప్రగతి పదములు నా ధ్యేయమని సర్పంచ్ రాపోలు యాదగిరి అన్నారు బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లోనే పలు కీలక అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని గ్రామ బస్టాప్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం ప్రారంభం కాగా గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి నర్సిరెడ్డిగూడెం రోడ్డు మర్రి చెట్టు వరకు సీసీ రోడ్లు పూర్తయ్యాయినట్లు తెలిపారు.

భవిష్యత్తులో గ్రామంలో మట్టి రోడ్లు లేకుండా పూర్తిగా సీసీ రోడ్లతో అభివృద్ధి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారూ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు దోమల నివారణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల నివారణ కోసం కూరగాయల అంగడిని నూతన సీసీ రోడ్డు ప్రాంతానికి మార్చారు.

గ్రామంలో ప్రమాదకరంగా మారిన పిచ్చి, కంప చెట్ల తొలగింపు 50% పూర్తయిందని మిగిలినవి త్వరలో తొలగిస్తామని తెలిపారు  రెండు నెలల్లోనే అంబులెన్సు ఏర్పాటు చేసి 24 గంటల వైద్య సేవలు ఎల్ఓసి ద్వారా నిమ్స్ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యం అందిస్తామని చెప్పారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు పెన్షన్లు మంజూరు చేసేందుకు గ్రామస్థాయి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. పెన్షన్ దయ కాదు హక్కు అని పేర్కొంటూ గ్రామపంచాయతీ నిధులు పూర్తి పారదర్శకతతో వినియోగిస్తామని స్పష్టం చేశారు.