25 June, 2026 | 2:21 PM

Breaking News

సీసీరోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాల లోపం

25-06-2026 01:45 PM

పనుల్లో పర్యవేక్షణ లేని అధికారులు 

చేర్యాల,జూన్ 25 : చేర్యాల పట్టణంలోని వివిధ వార్డులలో సిసి రోడ్లు వేస్తున్నదాన్ని గురువారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ బృందం పరిశీలించారు.ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి రాళ్ళ బండి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చిన నిధులలో ప్రతి వార్డుకు కోటి రూపాయలు కేటాయించుకొని పనులు చేస్తున్నారని అందులో భాగంగా వేస్తున్న ఈ సీసీ రోడ్డులో ఎలాంటి నాణ్యత లేదని వాటిని పరిశీలించకుండా కాంట్రాక్టర్ లతో కౌన్సిలర్లతో అధికారులు కుమ్ముక్కయి సీసీ రోడ్డు వేసే క్రమంలో అసలు ఇసుకనే వాడకుండా డస్ట్ తోని పనులుపూర్తి చేస్తున్నారని సీసీ రోడ్డు వేసే క్రమంలో అధికారులు ఉండకుండా వాటిని పరిశీలించకుండానే కాంట్రాక్టర్ రోడ్లు వేస్తున్నారని ఇప్పటికైనా అధికారులు దగ్గరుండి  కొబ్బరికాయలు కొట్టడమే కాకుండా పనులను కూడా పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.నాణ్యతా ప్రమాణాలు చుసిన తర్వాతనే బిల్లులు మంజూరు చేయాలని లేని యెడల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలోజు శ్రీహరి,ఆముదాల నర్సిరెడ్డి,ముస్త్యాల ప్రభాకర్, ఇప్పకాయల శోభ,బోయిన మల్లేశం,ఎర్ర బోసు అశోక్, ఎండి నూర్ బి,తుమ్మలపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.