పేదోళ్ళ పెద్ద బిడ్డ ఎర్ర సత్యం
డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మాహబూబ్ నగర్,(విజయక్రాంతి): పేదల పెద్ద బిడ్డగా ఎర్ర సత్యం ఎల్లప్పుడు వారి సంక్షేమం కోసం పరితపించేవారని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని ఎర్ర సత్యం చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఎర్ర సత్యం వర్ధంతి సందర్బంగా ఆయన విగ్రహానికి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఆయన పాలమూరు ప్రాంత అభివృద్ధికై, నిరుపేదల సంక్షేమానికై ఆయన చేసిన సేవలు, చూపిన చొరవ ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు. ఎర్ర సత్యం వేసిన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎర్ర సత్యం అభిమానులు, యువకులు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు.






