కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై చర్చ
19-08-2024 04:05 PM
హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై బేగంపేట హరిత ప్లాజా హోటల్ లో ట్రెసా ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటి కలెక్టర్లు, ట్రెసా ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై అధికారులు సలహలు, సూచనలు స్వీకరిస్తున్నారు. వీఆర్వోలుగా చేసిన వారిని మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ట్రెసా విజ్ఞప్తి చేశారు.






