26 May, 2026 | 1:27 PM

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎందుకు తగ్గాయి.

19-08-2024 04:37 PM

140 కోట్ల భారతీయులు కానీ పథకాల పంటకు ఆమడ దూరంలో ఎందుకు ఆగిపోతున్నామని క్రీఢాభిమానులు, క్రీఢాపండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  లక్ష్య సేన్, మీరాబాయి చాను, మను భాకర్ తో సహా వారి తాలూకు  ఈవెంట్‌లలో అథ్లెట్లు నాల్గవ స్థానంలో నిలవడంతో భారతదేశానికి రావాల్సిన ఆరు  పతకాలను కోల్పోయింది. ప్రపంచ స్థాయి అథ్లెట్లు భారత్ లో ఉన్నారు.. కానీ వివిధ ఈవెంట్‌లలో కఠినమైన పోటీని ఎదుర్కోవడం అనివార్యమైంది, అంతర్జాతీయ స్థాయి క్రీడా సన్నద్ధత అవసరం అందుకే  పతకాలు సాధించడం సవాలుగా మారిందని వారు వివరించారు. క్రీడా సంఘాలలో రాజకీయాలతో సహా వాటికి పలు కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

గాయాలు, ఆరోగ్య సమస్యలు:

పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులు  కొంతమంది  గాయాలు, ఆరోగ్య సమస్యలతో సతమత మయ్యారు. ఉదాహరణకు నీరజ్ చోప్రా, మీరాబాయి చాను మణికట్టు, భుజం తుంటి గాయాలతో బాధపడ్డారు.

ఒత్తిడి  అంచనాలు:

దేశం నుండి అధిక అంచనాలు తన తొలి ఒలింపిక్స్ లో పోటీపడుతున్న నిఖత్ జరీన్ వంటి కొంతమంది అథ్లెట్ల కు తాము అత్యుత్తమంగా ఆడాలనే  ఒత్తిడి వారి పెర్ ఫార్మెన్సును ప్రభావితం చేసిందంటున్నారు.

 టాలెంట్ ను సరైన సమయంలో గుర్తించక పోవడం :

 సరైన సమయంలో గ్రామీణ స్థాయిలోనే క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, పెంపొందించుకోలేక పోవటం వల్లే భారత్ పతకాల సంఖ్య పరిమితమైందని భారత మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, అభిప్రాయపడ్డారు.