సమస్యలను చిటికెలో పరిష్కరించే బ్రహ్మా ఆనందం.. గ్లింప్సెస్.. ?
19-08-2024 03:55 PM
హైదరాబాద్: నిజజీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెర పై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో అందరి సమస్యలను చిటికెలో పరిష్కరిస్తూనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నారని చిత్ర నిర్మాణంలో పాల్పంచుకున్న వర్గాలు తెలియజేశాయి. బ్రహ్మా ఆనందం పేరుతోనే రూపొందనున్న ఈ సినిమాని స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఆర్ వీ ఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం తాలూకు గ్లింప్సెస్ ను విడుదల చేశారు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియ వడ్ల మాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్ర ధారణ చేస్తున్నారు.






