దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం
ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, మే 29 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశా బ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నా రు. బుధవారం మీర్‌పేట్‌లో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. కేసీఆర్ పిలుపు మేరకు జూన్ 2వ తేదీ నుంచి మూ డు రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిం చాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్త య్యేలా కృషి చేస్తానని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.
బుధవారం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఒక్కో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం నాలుగు కోట్ల రూపాయాల నిధులు మంజూరు చేసి మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. బడంగ్‌పేట్ మున్సిపల్ పరిధిలో ఒకటి, తుక్కుగూడ ప్రాంతంలో మరొకటి నిర్మాణంలో ఉందన్నారు. పనులు సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.






