27 July, 2026 | 3:02 PM

రాజకీయాల్లో గెలుపోటములు సహజం

30-05-2024 02:03 AM

బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్

మహేశ్వరం, మే 29 : రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని మహేశ్వ రం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో హర్షగూడకు చెందిన బీఆర్‌ఎస్ మాజీ యూత్ అధ్యక్షుడు విజయ్ కుమార్ పవర్  తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వారికి కాషాయం కండువా కప్పి అందెల శ్రీరాములు పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నేరవేర్చడం లేదన్నారు. మజ్లిస్ పార్టీతో దోస్తి చేస్తూ కేరళలో పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి సెక్యులర్ ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. జూన్ 4వ తేదీన చేవెళ్ల పార్లమెంట్‌పై కాషా యం జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు రవి కుమార్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.