7 July, 2026 | 11:20 PM

పతంజలి ఫుడ్స్ లాభంలో క్షీణత

15-05-2024 12:05 AM

ముంబై, మే 14 : బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఫుడ్స్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 22 శాతం క్షీణించి రూ.206.32 కోట్ల వద్ద నిలిచింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.263 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. క్యూ4లో కంపెనీ ఆదాయం రూ. 7,873 కోట్ల నుంచి రూ.8,221 కోట్లకు పెరిగింది. రూ.497 కోట్ల ఇబిటాను, 6.08 శాతం చొప్పున ఇబిటా మార్జిన్‌ను సాధించింది. పతంజలి ఫుడ్స్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.6 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. వంటనూనెల అమ్మకాలు తగ్గ డం, పెరిగిన ధరల కారణంగా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో లాభాలు క్షీణించాయని కంపెనీ తెలిపింది. గ్రామాల్లో అధిక ధరలతో పాలు, గోధుమపిండి తదితర నిత్యావసరాల అమ్మకాలు తగ్గాయన్నది.