calender_icon.png 23 November, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘దీక్షా దివస్’ చరిత్రలో గొప్ప ఘట్టం

23-11-2025 12:00:00 AM

  1. ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి-
  2. నాయకులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం 

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో దీక్షా దివస్ గొప్ప ఘట్టమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్ ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే త్యాగ నీరతితో దీక్షను చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర చరిత్రలో ఘనమైన ఈ ఘటాన్ని స్మరించు కుంటూ ఈ నెల 29న దీక్షా దివస్‌ను  తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

శనివారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ బాడీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దీక్షా దివస్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శనం చేశారు. దీక్షా దివస్ నిర్వహణకు ముందుగా ఈ నెల 26న అన్ని జిల్లాల పార్టీ కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, మా జీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సహా ఇతర కీలక నాయకులందరినీ ఆహ్వానించాలని ఆదేశించారు.

ఈ సన్నాహక సమావే శాల ముఖ్య ఉద్దేశం, నవంబర్ 29న పార్టీ ఘనంగా నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమా న్ని విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. మొదటగా తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించాలన్నారు. కనీసం 1000 మంది కీలక పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించాలన్నారు.

అప్పటి అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో కూడి న ఫొటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. దీక్షా దివస్ రోజున పండ్ల పంపిణీ, వీలుంటే అన్నదానం లాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ లో ప్రత్యేకంగా పండ్ల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అలాగే, పార్టీ యూత్, విద్యార్థి విభాగం తరఫున ప్రతి యూనివర్సిటీలో దీక్షా దివస్‌ను నిర్వహించాలన్నారు. ఆ సమయంలో వారు దీక్షా దివస్ పేరుతో, కేసీఆర్ చిత్రంతో కూడిన ప్రత్యేక టీ-షర్టులను ధరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.