calender_icon.png 21 February, 2026 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలో సెక్రటేరియట్ ముట్టడి విజయవంత చేయాలి

21-02-2026 08:41:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న నిర్వహించే చలో సెక్రెటరీ ముట్టడి విజయవంత చేయాలని టిఎంయూ రాష్ట్ర అధ్యక్షులు ఏఆర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలోని టీజీ ఆర్టీసీ ఏడు సంఘాలతో జేఏసీగా ఏర్పడి ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులడిమాండ్ల సాధనకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీని సంరక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీజీ ఆర్టీసీ కార్మికులు హాజరు కావాలన్నారు