26 February, 2026 | 5:04 PM

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది

26-02-2026 03:08 PM

నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన...

గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి 

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 

సుల్తానాబాద్, (విజయక్రాంతి): అభివృద్ధి , సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, గ్రామాల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, గురువారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం 20 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు,  అనంతరం 5 లక్షల రూపాయల నిధులతో అంగన్వాడీ భవనం రినివేషన్ చేసి ప్రారంభించారు, 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు  మాట్లాడుతూ..దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ  పథకాలు తెలంగాణ రాష్ట్రంలో  చేపడుతున్నామని అన్నారు.. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి పనులు గ్రామస్తులు భాగస్వాములై నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులను నిలదీయాలని అన్నారు. గ్రామంలో అనేక అభివృద్ధి పనులతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు....ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.