21 March, 2026 | 1:49 AM

మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియాగా దీప్తి శ్రీరంగం

20-03-2026 10:43 PM

హైదరాబాద్ , మార్చి ఃఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీప్తి శ్రీరంగం మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. 7 సంవత్సరాల కఠిన శ్రమ, పట్టుదల తర్వాత ఆమె ఈ విజయాన్ని సాధించింది.దేశవ్యాప్తంగా 500కి పైగా పోటీదారులు పాల్గొన్న ఈ పోటీలో దీప్తి విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ హీరోయిన్లు మౌనిక కలాపాల, నక్ష శరన్, డా. అక్షయ, ప్రణూప్ జవహర్ ఈ పోటీలకు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.

మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం , భారతదేశ ఐక్యతకు ప్రతీకగా ఈ ఫ్యాషన్ షో నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు., ప్రతి ఫైనలిస్ట్ తమ రాష్ట్రపు సంస్కృతి, సంప్రదాయం ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ పోటీలో పాల్గొనటం చాలా గొప్పగా అనిపించిందనీ,, అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రతిభ, ఆత్మవిశ్వాసం, స్టేజ్ ప్రెజెన్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దీప్తిని విజేతగా జూరీ మెంబర్స్ ఎంపిక చేశారనీ వెల్లడించారు. త్వరలో కిడ్స్ కు, టీనేజర్స్ కి మరిన్ని సెగ్మెంట్స్ లో కూడా ఫ్యాషన్ షోలు నిర్వహిస్తామని  తెలిపారు.