కింగ్ ఆఫ్ కేయాస్.. ఎంట్రీ అదుర్స్!
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఓ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఎన్‌బీకే111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. బుధవారం బాలకృష్ణకు పుట్టినరో జు సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ పేరుతో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ పాత్రను పరిచయం చేశారు. 1993 బాంబే అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ వీడియోలో డార్క్, హింసతో నిండిన ప్రపంచాన్ని చూపించారు.
బాలకృష్ణ పాత్రను ‘కింగ్ ఆఫ్ కేయాస్’గా ప్రజెంట్ చేశారు. డైలాగ్స్ లేకుండానే విజువల్స్ ద్వారా బాలకృష్ణ పాత్ర పవర్‌ను ఆసక్తికరంగా చూపించారు. మనోజ్ మంచు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: అరవింద్ ఎస్ కాశ్యప్ (ఐఎస్‌సీ); సంగీతం: తమన్; సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా; యాక్షన్: రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్.






