15 July, 2026 | 3:08 AM

క్షీణించిన వేదాంత నికరలాభం

26-04-2024 12:10 AM

ముంబై, ఏప్రిల్ 25: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్  నిరుత్సాహకర ఫలితాల్ని వెల్లడించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరం క్యూ4లో కంపెనీ లాభం భారీగా 27 శాతం క్షీణించి రూ.1,369 కోట్లకు పడిపోయింది. గత ఏడాది క్యూ4లో వేదాంత రూ.1,881 కోట్ల  నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం సైతం 6 శాతం తగ్గుదలతో రూ.34,937 కోట్ల వద్ద నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.37,225 కోట్లుగా నమోదయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో వేదాంత నికరలాభం 60 శాతం క్షీణతతో రూ.10,574 కోట్ల నుంచి రూ.4,239 కోట్లకు తగ్గింది. ఆదాయం సైతం రూ.1,45,404 కోట్ల నుంచి రూ.1,41,793 కోట్లకు పడిపోయింది.