15 July, 2026 | 3:16 AM

విధ్వంసం కొనసాగేనా?

25-04-2024 12:47 AM

n నేడు బెంగళూరుతో సన్‌రైజర్స్ ఢీ

n సొంతగడ్డపై ఫెవరెట్‌గా హైదరాబాద్

‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా.. కాదు మాస్.. ఊర మాస్.. హైదరాబాద్ అంటే ప్లవర్ అనుకుంటివా.. కాదు ఫైర్’

ఈ సినిమా డైలాగుల్ని సన్‌రైజర్స్ సారథి అచ్చ తెలుగులో ఉచ్ఛరిస్తూ.. రైజర్స్ అభిమానులకు మరో పరుగుల విందు గ్యారంటీ అని భరోసానిచ్చాడు. 

ఇంటా బయటా అనే తేడా లేకుండా దంచికొట్టడమే పరమాధిగా సాగుతున్న హైదరాబాద్ సొంతగడ్డపై మ్యాచ్‌కు సిద్ధమైంది. బలహీనంగా 

కనిపిస్తున్న బెంగళూరును ఉప్పల్‌లో ఉతికారేయడానికి కమిన్స్ సేన రెడీ అవుతోంది. ఇంకేంటి పరుగుల వర్షంలో తడిసిముద్దయ్యేందుకు తయారైపోండీ..

300 పరుగులు బాదడమే లక్ష్యంగా బరిలోకి

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: ఊహకు కూడా అందని విధ్వంసంతో ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోతుంది. హైదరాబాద్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులను వణికిపోయేలా చేస్తుంది. ఒక మ్యాచ్‌కు మించి మరో మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న హైదరాబాద్ సొంతగడ్డపై గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. ఇన్నాళ్లు ప్రత్యర్థి వేదికలపై బౌలర్లను ఆడుకున్న హైదరాబాద్ సొంత ఇలాకాలో ఎంతటి విధ్వంసం సృష్టించనుందనేది ఆసక్తికరం. ఇదే సీజన్‌లో బెంగళూరుపై అత్యధిక స్కోరు( 287) నమోదు చేసిన హైదరాబాద్ ఉప్పల్‌లో ఆ రికార్డును బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. పసలేని బెంగళూరు బౌలర్లను చితక్కొట్టాలని కంకణం కట్టుకుంది. హైదరాబాద్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. బెంగళూరు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలతో ఆఖరి స్థానంలో ఉంది.

300 పరుగులే లక్ష్యంగా..

రికార్డు స్థాయిలో ఈ సీజన్‌లో ఇప్పటికే 250 ప్లస్ స్కోర్లు మూడుసార్లు బాదిన హైదరాబాద్ బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఒకరిని మించి ఒకరు పరుగులు చేయడంలో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా హెడ్ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. సింగిల్స్ తీయడానికి కూడా ఇష్టపడని హెడ్ బంతి పడిందే ఆలస్యం బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండ్రీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో పవర్ ప్లే ముగిసేసరికే జట్టు స్కోరు రికార్డు స్థాయిలో 125 పరుగులు దాటిందంటేనే హెడ్ ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడనేది అర్థమవుతోంది.

ఇక అభిషేక్ శర్మ కూడా తక్కువేం తినలేదు. హెడ్‌తో సమానంగా మెరుపులు మెరిపిస్తూ రైజర్స్‌కు మెరుగైన ఆరంభాలు అందిస్తున్నాడు. ఇక వీరిద్దరి తర్వాత చెప్పుకోవాల్సింది క్లాసెన్ గురించి. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్లాసెన్ (26) తొలి స్థానంలో ఉన్నాడు. బౌండ్రీలు వద్దు సిక్సర్లే ముద్దు అన్న చందంగా క్లాసెన్ వీరంగం సృష్టిస్తూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఆ తర్వాత వస్తున్న మార్కరమ్, షాబాజ్, నితీశ్ రెడ్డి, సమద్‌లు అవసరమైన సమయంలో బ్యాట్ ఝలిపిస్తూ హైదరాబాద్ భారీ స్కోర్లు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన హైదరాబాద్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు వస్తే ఈసారి 300 పరుగులు దాటడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లుగా అనిపిస్తోంది.

బౌలింగ్‌లోనూ బలంగా..

హైదరాబాద్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ కమిన్స్ నేతృత్వం లోని పేస్ విభాగం ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతోంది. నటరాజన్ తన యార్కర్లతో ఇం పాక్ట్ చూపిస్తుండగా..  మార్కం డే  తన స్పిన్ అస్త్రంతో వికెట్లు పడగొడుతున్నాడు. భువనేశ్వర్, ఉనాద్క ట్‌లు వికెట్లు తీస్తున్నప్పటికి దారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఇబ్బందిగా మారింది.