24 March, 2026 | 6:08 AM

15 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు

24-03-2026 01:31 AM

తెలుగు రాష్ట్రాల్లో నిజామాబాద్‌కు ఛాన్స్

ముంబై, మార్చి 23: ఐపీఎల్ టికెట్లు దొరక్క నిరాశ చెందే అభిమానుల కోసం బీసీసీఐ ప్రతీ ఏడాది పలు నగరాల్లో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా వారాంతాల్లో ఈ ఫ్యాన్ పార్క్స్ అభిమానులను అలరిస్తుంటాయి. ఇక్కడ భారీ ఎల్‌ఈ డీ స్క్రీన్లపై ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారంతో పాటు మ్యూజిక్, ఫుడ్ కోర్టులు, గే మ్స్, ఫ్యాన్ యాక్టివిటీస్ వంటి వినోదాలు ఉంటాయి. 2015 నుంచి బీసీసీఐ ఆ ఫ్యాన్ పార్కులకు శ్రీకారం చుట్టింది. ప్రతీ ఏడాది వీటికి ఆదరణ పెరుగుతుండడంతో ఎప్పటికప్పుడు నగరాల సంఖ్యను పెంచుకుంటూ వీటిని ఏర్పాటు చేస్తోంది. ఈ సారి ఐపీఎల్ 19వ సీజన్ కోసం దేశవ్యాప్తంగా 15 నగరా ల్లో ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ జాబితాలో తెలుగు రా ష్ట్రాల నుంచి ఒకే ఒక్క నగరం చోటు దక్కించుకుంది. తెలంగాణలోని నిజామాబాద్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ గ్రౌండ్స్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. తొలి వీకెండ్‌లో మార్చి 28, 29 తేదీల్లో.. రోహ్తక్, భో పాల్, నాగ్పూర్, తుమకూరు, కృష్ణనగర్ న గరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఏప్రి ల్ 4, 5 తేదీల్లో మథుర, జోధ్పూర్, నిజామాబాద్, మైసూర్, భువనేశ్వర్ నగరాల్లో ఫ్యాన్ పార్కులు ఉంటాయి. ఇక చివరి వా రాంతం ఏప్రిల్ 11, 12 తేదీల్లో మీరట్, నడియాద్, రత్నగిరి, కోయంబత్తూరు, రూర్కెలా నగరాల్లో ఫ్యాన్ పారక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.