10-12-2025 01:24:48 PM
న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు అంశంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారని, ఈ సంఘటన వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయిందని న్యాయస్థానం పేర్కొంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని కేంద్రాన్ని హైకోర్టు అడిగింది. ఇండిగో సంక్షోభ సమయంలో ఇతర సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు ఎలా పెంచుతాయని ప్రశ్నించడంతో ఇండిగో వ్యవహారంపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని కేంద్రం వెల్లడించింది. ఇండిగో సంస్థకు ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చామని, విమానాల రద్దుపై ఆ సంస్థ ఇప్పటికే క్షమాపణలు చెప్పిందని కేంద్రం తెలిపింది.