calender_icon.png 21 February, 2026 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దహన సంస్కారాల కోసం దాతృత్వం చాటుకున్న వెంపటి గ్రామ యువత

21-02-2026 01:30:01 PM

తుంగతుర్తి, (విజయక్రాంతి): గ్రామానికి చెందిన ఓ పేద వ్యక్తి మరణించడంతో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించిన ఓ దాత పెద్దమనసుతో ముందుకు వచ్చారు. తనవంతు ఆర్థిక సహాయం అందించి దహన కార్యక్రమాలు సజావుగా జరగేలా సహకరించారు.  

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన కొండగడుపుల లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందగా మడిపెద్ది మధు దహన సంస్కారాలకు రూ.5000 వేలు ఆర్థిక సహాయం చేసి తన మానవత్వాన్ని చాటుకోగా.. వెంపటి వాట్స్అప్ గ్రూపులో సమాచారం ఇవ్వగా, గ్రామ యువత తమ ఎవరికి తోచినంతగా వారు ఆర్థిక సహాయం చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా పెద్ద మనసు చాటుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులు వారిని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం నిజమైన మానవత్వమని పేర్కొన్నారు. గ్రామంలో ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది.