calender_icon.png 21 February, 2026 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి

21-02-2026 01:21:25 PM

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తు నిత్య జీవనంలో వాకింగ్, వ్యాయామం భాగం చేసుకోవాలి

అదనపు ఎస్పీ చంద్రయ్య.

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయ అవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారి ఆదేశాల మేరకు జిల్లా ఆర్మూడ్ రిజర్వ్,సివిల్, హోమ్ గార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. పరేడ్ లో భాగంగా సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్ లను పరిశీలించిన అదనపు ఎస్పీ చంద్రయ్య.ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.... పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట వ్యాయామం,నడక ఏదో ఒకటి చేయాలని,

సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని ఎస్పీ గారు తెలిపారు.వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ,యూనిటీగా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుందన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేస్తూ పోలీస్ శాఖకి, జిల్లాకి మంచి పేరు తెచ్చేలాగా పని చేయాలని అన్నారు.సిబ్బందికి ఏదైనా సమస్య వుంటే ఎప్పుడైనా తనను కలుసుకొని తమ సమస్యను తెలియజేసుకోవచ్చని అన్నారు. ఈ పరేడ్ లో ఆర్.ఐ లు సి.ఐ లు కృష్ణ, మధుకర్,యాదగిరి, రమేష్,ఎస్.ఐ లు కిరణ్ కుమార్, సాయి కిరణ్, జునైద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.