3 August, 2026 | 8:32 PM

ప్రమోషన్లు వద్దు.. ఇంటిపనే ముద్దు

21-06-2024 10:13 PM

న్యూయార్క్: కొవిడ్ మహమ్మారి మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. అందులో ఒకటి ఇంటి నుంచి పని. కరోనా కారణంగా కోట్లమంది ఉద్యోగులు నెలలపాటు వర్క్ ఫ్రం హోమ్ చేశారు. కరోనా ముప్పు తొలగి పోయిన తర్వాత కూడా అదే పనికి అలవాటు పడ్డారు. దీంతో వారిని ఆఫీసులకు రప్పించటం కంపెనీలకు తలకుమించిన భారంగా మారింది.

ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు యాజమాన్యాలు అనేక తాయిలాలు కూడా ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉత్పత్తి సంస్థ డెల్ కూడా అమెరికాలోని తన కార్యాలయాలకు ఉద్యోగులను రప్పించేందుకు ప్రమోషన్ల ఆశ చూపింది. అయినా, ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేది లేదని మొండికేస్తున్నారట. ‘మాకు ప్రమోషన్లు వద్దు.. ఇంటినుంచే పని చేస్తాం’ అని తెగేసి చెప్తున్నారట.