3 August, 2026 | 9:17 PM

గ్రీవెన్స్ డేలో 38 ఫిర్యాదులు

03-08-2026 08:10 PM

సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 38 ఫిర్యాదులను స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పంపించి చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పరిష్కార ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.