అప్పుడు వద్దని.. ఇప్పుడేందుకు మద్దతిచ్చారు : కేటీఆర్
21-06-2024 09:46 PM
హైదరాబాద్ : దేశంలో గనుల వేలం ప్రారంభమైంది. తెలంగాణ గనుల వేలం అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గతంతో తెలంగాణలో ఉన్న గనులను వేలం వెయాలని కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని అడిగితే తమ ఒప్పుకోలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గనుల వేలాన్ని వ్యతిరేకించారని, అధికారంలోకి వచ్చాక గనుల వేలంలో పాల్గొన్నారని చెప్పారు. గనుల వేలం వివాదాన్ని మళ్లించేందుకు ఎంఎల్ఎల చేరికల డ్రామా చేస్తున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. గనుల వేలంలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు క్షమించరని కేటీఆర్ పేర్కొన్నారు.






