బాల్కసుమన్ బెయిల్ మంజూరు
21-06-2024 10:31 PM
హైదరాబాద్ : బాల్కసుమన్ సహా 11 మంది బీఆర్ఎస్ నేతలకు బెయిల్ మంజూరు అయింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఆ సమయంలో బాల్క సుమన్ పోచారం ఇంటి ముందు ఆందోళన చేశాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం ఆయనతో పాటు మరో 1 మందిని అదుపులోకి తీసుకోని అరెస్టు చేసి కోర్టులకు తరలించారు. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశిస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.






