calender_icon.png 20 February, 2026 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువు సంపద ప్రజలకే చెందాలి

20-02-2026 07:06:31 PM

- తామర పువ్వులకు ఓపెన్ వేలం వేయాలంటూ డిమాండ్

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని ఊర చెరువులో ఉన్న తామర పువ్వులను బహిరంగ వేలం పాట ద్వారా విక్రయించాలని కోరుతూ చందుపట్ల గ్రామస్తులు శుక్రవారం మండల కేంద్రంలో ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ... బహిరంగ వేలంపాట నిర్వహించడం ద్వారా గ్రామ పంచాయతీకి సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా చెరువులోని తామర పువ్వులను పారదర్శకంగా బహిరంగ వేలంపాట ద్వారా ఇవ్వాలని అధికారులను కోరినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల అభ్యర్థనను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ యాతాకుల రఘు, కలగాని వెంకన్న, శిగ శ్రీనయ్య, అనంతుల ఆంజనేయులు, బాష్పంగు సునీల్, చెరుకు నగేష్ తదితరులు పాల్గొన్నారు.