27 June, 2026 | 1:33 AM

రైతుభరోసా దరఖాస్తుకు జూలై 15 ఆఖరు

27-06-2026 12:30 AM

ఏవో ప్రవీణ్ చారి

నాగలిగిద్ద, జూన్ 26: వానాకాలం 202627 రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులు జులై 15లోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని నాగలిగిద్ద మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ చారి తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు భరోసా పథకానికి అర్హులని పేర్కొన్నారు. రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ సీడింగ్, ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు ఉన్నా వెంటనే సరిచేసుకోవాలని సూచించారు.