ఆశా కార్యకర్తల హామీలు అమలు చేయాలని డిమాండ్
17-03-2026 01:22 AM
నాగర్ కర్నూల్ మార్చి 16 ( విజయక్రాంతి ) ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేపట్టారు.
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు మాట్లాడుతూ ఆశాలకు పెండింగ్లో ఉన్న పారితోషకాలు వెంటనే చెల్లించి రూ.18 వేల ఫికస్డ్ వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, కెవిపిఎస్, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మరియు ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




