9 August, 2026 | 6:53 PM

మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న 6,7 వార్డులలో స్థానిక సమస్యలను పరిష్కరించాలి

02-09-2025 07:43 PM

మరిపెడ,(విజయకాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మున్సిపాలిటీ కేంద్రంలోని 6,7 వార్డులలో ఉన్నా స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకుడు బాణాల రాజన్న ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ వార్డుల పరిధిలోని రోడ్లు పూర్తిగా  బుడదమయం అయ్యా అని వివరించారు. వర్షాల వల్ల మిషన్ భగీరథ పైపులైను లీకై వాటర్లో బురద నీళ్లు కలవడం వల్ల వాటర్ కలుషితమై విష జ్వరాలు వస్తున్నాయని వివరించారు.

రోడ్లు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రోడ్డు కరెక్టు లేపడం వల్ల కనీసం మా వార్డులకు వాటర్ కూడా సరిగా రావడం లేదు, గ్యాస్ బండి రావడం లేదు, వీధిలైట్లు కరెక్టుగా వెలగడం లేదు సైడ్  కాల్వలు పూర్తిగా లేవు అని వివరించారు. ఈ కాలనీవాసుల ప్రజలు మా దగ్గర కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లు, ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు. కానీ మాకు సరైన వసతులు కల్పించడం లేదని వివరించారు,ప్రభుత్వ జిల్లా మున్సిపాలిటీ యంత్రాంగం దక్షణమే స్పందించి ఈ సమస్యలన్ని  పరిష్కరించకపోతే మైనార్టీ కాలనీవాసుల సమస్యలు నెరవెర్చే వరకు నిరంతరం పలు దఫాలుగా ఉద్యమం చేస్తామని రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.