వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
02-09-2025 07:38 PM
నిర్మల్,(విజయక్రాంతి): లక్ష్మణ చందా మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. తీర్పెల్లి వాగు బ్రిడ్జి, చామన్ పల్లి వాగు బ్రిడ్జిలను పరిశీలించారు. వరద ఉదృతి వల్ల వాగుపై నుండి నీరు రావడంతో రాకపోకలకు, చుట్టుపక్కల పొలాలు ముంపుకు గురవుతున్నాయని తెలపడంతో అధికారులను ఆదేశించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.






