సోషల్ ఆడిట్ పకడ్బందీగా చేపట్టాలి
02-09-2025 07:50 PM
సిర్పూర్(యు),(విజయక్రాంతి): ఎన్ఆర్ఈజిఎస్ పథకంలో చేపట్టిన పనులపై పూర్తి స్థాయిలో సోషల్ అడిట్ పకడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవో కృష్ణారావ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ సిబ్బంది, సోషల్ అడిట్ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... 2024 నుండి 2025 వరకు ఈజిఎస్ ద్వారా సుమారు 3.40 కోట్ల పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.ఇందులో లేబర్ పేమెంట్ తో పాటు మెటీరియల్ పేమెంట్ ఉన్నట్లు తెలిపారు.దీనికి సంబందించిన అన్ని రకాల రికార్డులు అడిట్ బృందానికి ఆపగించినట్లు తెలిపారు. అడిట్ బృందం బుధవారం నుంచి ఆదివారం వరకు గ్రామ స్థాయిలో అడిట్ నిర్వహించాలని వచ్చే సోమవారం మండల స్థాయి ప్రజా వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు.






