రాంగ్‌రూటులో రవాణా శాఖ!
- ఆర్టీవో కార్యాలయాల్లో ఏజెంట్ల్లు ఉంటేనే పనులు
దళారులతోనే శరవేగంగా డ్రైవింగ్ లెసెన్స్‌లు
ఇదే అదనుగా నిలువుదోపిడీకి బ్రోకర్లు
అధికారులకు తెలిసినా వాటాలతో సైలెంట్!!
సంగారెడ్డి, జూన్ 16 (విజయక్రాంతి): రవాణా శాఖ కార్యాలయలో మధ్యవర్తులు లేకుండా వాహనదారులకు పారదర్శక సేవలవందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అధికారులు ఏజెంట్ల లేనిది పనులు చేయడం లేదు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరులో యూనిట్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా కార్యాలయం సంగారెడ్డిలోని కందిలో ఉంది.
రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో డ్రైవింగ్ లెర్నింగ్ లెసెన్స్‌లు, లెసెన్స్‌లు , వాహనాల రిజిస్టేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు, రోడ్ పర్మిట్లు, మోటార్ వాహనాల పన్ను లు, తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, మోటా ర్ డ్రైవింగ్ స్కూల్స్ అనుమతులు, పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు కోసం అనుమ తులు జారీ చేస్తారు. వీటితో పాటు పలు రకాల సేవలు ఆర్టీవో కార్యాలయంలో అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలు ప్రవేశ పెట్టినా ఆర్టీవో కార్యాలయల్లో ఏజెంట్ల హవా ఇంకా యథేచ్చగా సాగుతోంది. ఆర్టీవో కార్యాలయాల్లో సుదీర్ఘకాలం గా పాతుకుపోయిన కొంతమంది ఏజెంట్లను ఆశ్రయిస్తేనే వాహనదారులకు పనులు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. సైకిల్ మోటార్, ఆటో రిజిస్ట్రేషన్ నుంచి పేరు మార్పు చేసుకోనే వరకు అక్కడ ఏజెంట్లు నిర్ణయించిన మొత్తం డబ్బులు చెల్లించుకోవాల్సిందే.
అధిక డబ్బులు వసూలు?
సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్ రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో పని చేసే అధికారులు ఏజెంట్లను నియమించుకుని నిబంధనల పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలల బస్సులకు ఫిట్నెస్ (సామర్థ్యపు ధ్రువీకరణ పత్రాలు) జారీ చేసేందుకు ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలల బస్సులసు ఎంవీఐ అధికారులు తనిఖీ చేసి బస్సుల యాజమాన్యాలకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫిట్నెస్ కోసం రవాణా శాఖ కార్యాలయంకు వెళితే ఏజెంట్లు సిఫార్సు చేసిన పాఠశాలల బస్సులకే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) జారీ చేస్తున్నారని తెలిసింది.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం నేరుగా దరఖాస్తులు చేసుకున్న వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిబంధనల పేరుతో రవాణా శాఖ అధికారులు ఒక్క పాఠశాల బస్సుకు రూ.10 నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో పాఠశాలల బస్సుల నుంచి రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, ఏజెంట్ల చేతుల మీదుగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం. జేసీబీలు, లారీల రిజిస్ట్రేషన్లకు రూ. వేలల్లోనే మామూళ్ల వసూళ్లు చేస్తున్నారు. వాహనాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు నేరుగా మాట్లాడకుండా వారి తరపున ప్రత్యేకంగా ఉన్న ఏజెంట్ల మాట్లాడి డబ్బులు వసూలు చేస్తున్నారు.
రోజు సాయంత్రానికి ఇళ్లకు డబ్బులు?
రవాణా శాఖ కార్యాలయల్లో పని చేసే అధికారులకు ప్రతి రోజు సాయంత్రం వరకు ఏజెంట్లు డబ్బులు అప్పుగిస్తారు. ఏజెంట్ల దరఖాస్తులకు వివిధ రకాల కోడ్ గుర్తులతో పనులు చక్కబెడతారు. దరఖాస్తులకు సం బంధించిన నగదును పక్కగా లెక్కలు వేసి వారు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు సాయంత్రానికి సంబంధిత అధికారులకు డబ్బులు అప్పుగిస్తారు. రవాణా శాఖ కార్యాలయల్లో గుట్టచప్పుడు కాకుండ సాగుతున్న అక్రమ దందా కొనసాగుతుంది. సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్ యూనిట్ కార్యాలల్లో ప్రైవేటు వ్యక్తుల దం దా యథేచ్చగా కొనసాగుతుంది. ఏజెంట్ల ఆడిగినంత ఇస్తేనే దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఏజెంట్లు అధికారులను శాసించే పరిస్థితి ఉంది. ఏజెంట్లు మామూళ్ల ధరలను భారీగా పెంచారు. ఏజెంట్ల వ్యవస్థ లేకపోయిన రవాణా శాఖ కార్యాలయంలో మాత్రం వారి కనుసైగల్లో పనులు జరుగుతున్నాయి.
ఏజెంట్ల కనుసైగలో పనులు..
జిల్లాలోని రవాణా కార్యాలయల్లో ఏజెంట్ల కనుసైగలతో పనులు జరుగుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయం లో ఏజెంట్ల కంటికి కనిపించకపోయిన వారు సమర్పించిన దరఖాస్తులు మాత్రం అనుకున్న సమయానికన్న ముందుగానే అయిపోతున్నాయి. అదే వాహనదారుడు నేరుగా దరఖాస్తు తీసుకోని సంబంధిత కౌంటర్ వద్దకు వెళితే గంటల తరబడి నిలబడితేగాని ఆ దరఖాస్తు తీసుకోరు. దరఖాస్తు తీసుకున్న తర్వాత కార్యాలయం చుట్టూ కాళ్లరతగేలా తిరిగినా పని అవుతుందో లేదో చెప్ప లేని పరిస్థితి ఉంది. పనులు సకలంలో కావడం లేదని తెలుసుకోని ఏజెంట్లకు అడిగినంత ఇచ్చేస్తే వాళ్లే పని పూర్తి చేసి పెడతారనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. వాహనదారులు, డ్రైవిం గ్ లెసెన్స్‌ల కోసం వారిని ఏజెంట్లు నిలువుదోపిడీ చేస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్ల పనులను చక్క పెడుతున్నారు.
ఏజెంట్లను ఆశ్రయించొద్దు
సంగారెడ్డి జిల్లాలో ఏ రవాణా శాఖ కార్యాలయాల్లో వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకుని పనులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులు చెల్లించాలి. ఏజెంట్ల అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలి.
వెంకటరమణ, డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ సంగారెడ్డి






