ప్రైవేటు ఫీవర్!
- కార్పొరేట్ ముసుగులో కాసుల దోపిడీ
సీబీఎస్ సిలబస్ పేరుతో అడ్డగోలు వసూళ్లు
పేట్రేగిపోతున్న ప్రైవేటు సూళ్ల యాజమాన్యాలు
ఫీజుల నియంత్రణపై సర్కారు చోద్యం
వికారాబాద్, జూన్16 ( విజయక్రాంతి) : ప్రైవేటు పాఠశాలల్లో దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోతోంది. ప్రైవేటులో అడ్మిషన్ అనగానే పిల్లల తల్లిదండ్రులకు పగలే చుక్క లు కనిపిస్తున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడు ఏకంగా 30శాతం ఫీజులు పెంచి వసూళ్లు చేస్తుండటం తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోంది. వికారాబాద్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలల మాఫి యా పిల్లల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత అధికారులు తమకేమి తెలియనట్లు గమ్మునా ఉండిపోతున్నారు.
కార్పొరేట్ పాఠశాలల పేర్లు చెప్పు కొని కొన్ని పాఠశాలలు వేల ఫీజులు వసూ ళ్లు చేస్తుండగా, సీబీఎస్ సెలబస్ పేరుతో మరికొన్ని పాఠశాలలు ఫీజులు దండుకుంటున్నారు. దీంతో చిన్నా చితక ప్రైవేటు పాఠ శాలలు చతికిల పడుతున్నాయి. ప్రతిఏటా ప్రైవేటు పాఠశాలలు ఈ రకమైన దందాను నడుపుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం మొద్దునిద్ర వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు అందించే అమ్యమ్యాలకు ఆశపడి అధికారులు గమ్మున ఉండిపోతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
కార్పొరేట్ పేరుతో వసూళ్లు
జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్ పట్టణాల్లో కార్పొరేట్ పేరుతో సుమా రు 55 పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో కొత్తగా చేరే విద్యార్థులకు కేవలం అడ్మిషన్ ఫాం కోసం రూ. 1000 నుండి రూ.2వేలు వసూళ్లు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని పాఠశాలలు విద్యారంగంలో పేరుగాంచిన పాఠశాలల కరికులమ్‌ను అనుసరిస్తున్నామని, పాఠశాల ఫీజుకు ఏమాత్రం సంబంధం లేకుండా అందుకు ఒక్కో విద్యా ర్థి నుండి అదనంగా రూ. 4వేలు వసూళ్లు చేస్తున్నారు. కార్పోరేట్ పాఠశాలల పేర్లు, కొన్ని ఏళ్లుగా పాఠశాలలు నడుతున్న అనుభవం ఉండికూడా ఇతర పాఠశాలల కరి కులమ్ అనుసరిస్తామంటూ వేలకు వేలు ఫీజులు వసూళ్లు చేయడం ఏమిటని తల్లిదండ్రులు వాపోతున్నారు. కార్పొరేట్ కాకపో యినా ఆ పేర్లు పెట్టుకొని నడిపిస్తున్న పాఠశాలల్లో నర్సరి, ఎల్‌కేజీ, యూకేజీలో చేర్పించాలంటే రూ. 30వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నోట్‌బుక్స్ పేరుతో వసూళ్లు
ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడి ఓ రకంగా ఉంటే నోట్‌బుక్స్, టెక్స్‌ట్ బుక్స్, వర్క్ బుక్స్ పేరుతో లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో యాజమాన్యాలు అమ్మిన పుస్తకాలే కొనుగోలు చేయాలి. 1వ తరగతి విద్యార్థులకు అవసరమైన వర్క్‌బుక్స్, నోట్స్‌కు ఈ ఏడాది రూ. 6500 నుం డి రూ.7500 వరకు వసూళ్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలే బోదించాలి. కాని సీబ్యాచ్, టెక్నో పేర్ల తో 6వ తరగతి విద్యార్థికి రూ. 8500, ఆ పై తరగతులకు రూ.12000 కేవలం టెక్ట్స్ బుక్స్‌కు వసూళ్లు చేస్తున్నారు. ఇవి కాకుండా సరిపడ నోట్‌బుక్స్, ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు బయట కొనాల్సిందే.
సీబీఎస్ సెలబస్ పేరుతో...
జిల్లాలోని మరికొన్ని ప్రైవేటు పాఠశాల లు ఏకంగా సీబీఎస్ సెలబస్ బోదిస్తామం టూ కొత్తరకం దోడిపికి తెరలేపారు. వికారాబాద్‌లోని సెయింట్ అంథోని, అలోక్య, బచ్ పన్, వంటి పాఠశాలలు ఈ రకంగా ప్రచా రం చేసుకోవడంతో పాటు, తమ వద్ద సీట్లు లేవంటూ ప్రచారం చేసుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎతం మంది పిల్లలను తీసుకెళ్లినా అడ్మీషన్లు చేసుకోవడం గమనర్హం. ఈ పాఠశాలల్లో కనీసం నిబంధనల ప్రకారం తరగతి గదులు, ఆట స్థలాలు లేకపోవడం ఆశ్చర్యా న్ని కలిగిస్తోంది. ఇంత బహిరంగంగా ప్రచా రం చేస్తూ అడ్మీషన్లు తీసుకుంటున్నా విద్యాశాఖ అధికారులు అడిగిన దాఖలాలు లేవు.
ఒక్కో స్కూల్ ఒక్కో రకంగా..
ఒక్కో స్కూలులో ఒక్కోలా యాజమాన్యాలు ఫీజులున్నాయి. నర్సరీ, ఎల్కేజీ,యూకేజీకి సగటు న రూ. 24వేలు నుంచి 28 వేల వరకు వసూలు చేస్తుండగా, నోట్‌పుస్తకాలు, వర్క్ బుక్స్‌కు మరో రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఫీజు వసూలు చేస్తుండగా, వర్క్ బుక్స్‌కు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తు న్నాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.40 వేలు నుంచి రూ.58 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్ కు మరో రూ.8 వేల నుంచి రూ.11,900 వసూలు చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపుతున్నాయి.
సీ -బ్యాచ్, టెక్నో పేరుతో ఫీజు
తరగతి ఫీజు రూ.వేలలో
6వ తరగతి 48 వేలు
7వ తరగతి 50 వేలు
8వ తరగతి 52 వేలు
9వ తరగతి 54 వేలు
10వ తరగతి 60 వేలు
త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం
2018-19 లో తిరుపతిరావు కమిటీ ఇచ్చిన మేరకే ఫీజులు తీసుకోవాలి. అంతకు మించి ఫీజులు తీసుకోవద్దు. సీబీఎస్ అనుమతి జిల్లాలో హైదరాబాద్ స్కూల్ ఆప్ ఎక్సలెన్పీకి మాత్రమే ఉంది. మిగత పాఠశాలలు ఎవరైనా సీబీఎస్ సెలబస్ చెబుతున్నామంటే మాఉ ఫిర్యాదు చేయాలి. అధిక ఫీజు వసూళ్లు, నోట్‌బుక్స్, టెక్ట్స్ బుక్స్ అమ్మకాలపై త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తీసుకుంటాం.
రేణుకాదేవి, డీఈఓ, వికారాబాద్






