మధిరలో ఓటు వేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
12-02-2026 12:00 AM
ఎర్రుపాలెం ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): మధిర లో బుధవారం నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 9 వ వార్డులో ఉన్న తన ఓటును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉపయోగించుకున్నారు. 22 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
మధిరలో 22 వార్డులకు గాను మొత్తము ఓటర్లు 25679 ఉండగా 20000 ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మొత్తం ఏర్పాటు చేసిన 44 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 77.88% గా పోలింగ్ నమోదయింది. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది.




