26 May, 2026 | 9:55 AM

గురుకుల విద్యాసంస్థలపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

19-08-2024 06:54 PM

హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులతో కలిసి డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. గురుకుల పాఠశాలల స్థలసేకరణ, డిజైన్స్ తర్వగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం  రూ.5,000 కోట్లతో 30 ప్రదేశాల్లో 120 గురుకుల పాఠశాలల నిర్మాణం చేయనున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యార్థులకు వసతుల కల్పనపై ఆగస్టు 29 లోగా చెక్ లిస్టు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ విడుదల చేయించుకునే బధ్యత అధికారులదే అని డిప్యూటీ సీఎం వెల్లడించారు.