26 May, 2026 | 9:09 AM

మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

19-08-2024 07:27 PM

న్యూఢిల్లీ: వచ్చే వారం రోజుల్లో రెండు కీలక దేశాల పర్యటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి యూరోపియన్ దేశం పోలాండ్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మధ్య యూరప్ దేశాలల్లో పోలాండ్ వ్యాపారంలో భారత్ కు ప్రధాన భాగస్వామి అన్నారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత తొలిసారి పోలాండ్ లో భారత ప్రధాని మోదీ పర్యాటించనున్నారు. పోలాండ్ కు చెందిన సుమారు 30 కంపెనీలు భారత్ లో కార్యకాలాపాలు సాగిస్తున్నాయి.

సూమారు 5,000 మంది భారత విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. ప్రధాని మోదీ పోలాండ్ నుంచి ఉక్రెయిన్ వెళ్లి, ఆగస్టు 23వ తేదీన ఉక్రెయిన్ అధ్యక్షుడితో భేటీ కానున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం పెరుగుతున్న తరుణంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ లో భారత ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య వివాదాలపై ప్రధాని చర్చించే అవకాశం ఉంది. విదేశాంగశాఖ పశ్చిమ విభాగం కార్యదర్శి ప్రధాని మోదీ పర్యటన వివరాలను వెల్లడించారు.