రాజీవ్ గాంధీకి, తెలంగాణకు ఏం సంబంధమో చెప్పాలి?
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఐలాండ్ అభివృద్ధి చేశామన్నారు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజీవ్ గాంధీకి, తెలంగాణకు ఏం సంబంధమో చెప్పాలి..? అని ఆయన ప్రశ్నించారు. మేం అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి కాంగ్రెస్ చేసిన అవమానం రాష్ట్ర ప్రజలు మరిచిపోరన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న రాజీవ్ గాంధీ పేరును కూడా మారుస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ట్రిపుల్ ఐటీ, స్టేడియాలు రోడ్లకు రాజీవ్ పేర్లు ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ వందల మంది ప్రాణాలు తీసిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.






