30 July, 2026 | 1:48 PM

నాంపల్లి కోర్టుకు హాజరైన భట్టి విక్రమార్క

30-07-2026 01:12 PM

హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) గురువారం నాడు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2022 లో కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టారని భట్టి విక్రమార్కపై కేసు నమోదైంది. 2022లో కొత్తగూడెం ఆస్పత్రి వద్ద విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టారు. ఆ కేసు విచారణలో భాగంగా డిప్యూటీ సీఎం కోర్టుకు హాజరయ్యారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) రేపు ఫార్మూలా-ఈ కేసులో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.