రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
మృతుడి వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
బోధన్,జూలై 30 (విజయ క్రాంతి): నిజామాబాద్–డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ల(Nizamabad and Dichpally railway stations) మధ్య బర్దీపూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారుల సమాచారం మేరకు, జూలై 29 రాత్రి 11.20 గంటల సమయంలో లేదా అంతకుముందు, 30–35 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తుతెలియని వ్యక్తి బర్దీపూర్ గ్రామ శివారులోని నిజామాబాద్–డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నెం. 468/2-3 వద్ద గుర్తుతెలియని రైలు కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో రైలు కింద పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎం. రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నిజామాబాద్ రైల్వే ఎస్సై శ్రీ సాయి రెడ్డిని 8712658591 నంబర్‌లో సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.






