ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు.. కవిత్వం చెప్పిన పవన్ కళ్యాణ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన అయ్యనపాత్రుడుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కవిత్వం చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్వీకర్ గా రావడం సంతోషం. ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడి వేడి చూశారు. ఇన్నళ్లూ ప్రజలు మీ ఘాటైన వాగ్దాటి చేశారు.. ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయి. భాష మనసులను కలపడానికి.. విడగొట్టడానికి కాదు.. భాష విద్వేషం రేపడానికి కాదు.. పరిష్కరించడానికి, ఎంత జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందన్నారు. మనం వేసే ప్రతి అడుగు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.






