2 August, 2026 | 2:50 PM

అయ్యన్న ఏకగ్రీవం సంతోషం: సీఎం చంద్రబాబు

22-06-2024 12:20 PM

అమరావతి: ఏపీ అసెంబ్లీ స్వీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అని కొనియాడారు. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యారని చెప్పారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్రవేశారని చెప్పారు. విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు తాకనీయం అని డైలాగులు చెప్పారు, కానీ 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లలో గెలిచారని బాబు పేర్కొన్నారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబు ప్రశంసించారు.