27 July, 2026 | 12:26 PM

Breaking News

అదానీ డీల్ పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌

27-11-2024 12:16 PM

హైదరాబాద్: అదానీ ఒప్పందం అంశంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బుధవారం స్పందించారు. అదానీ అంశంపై కేబినేట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. అన్ని అంశాలు పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగిందన్నది తెలుసుకోవాలి.. మరింత లోతుగా అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. అదానీ సోలార్‌ ప్రాజెక్టు విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నారు.