27 July, 2026 | 12:47 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు

27-07-2026 12:17 PM

హైదరాబాద్: అబిడ్స్‌లో డ్రగ్స్‌ డీల్ సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. ఆదివారం అబిడ్స్‌లోని తిలక్ రోడ్డులో మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్(Anti-narcotics operation) నిర్వహిస్తుండగా, పారిపోయే ప్రయత్నంలో అనుమానిత మాదకద్రవ్యాల నిందితుడు తన కారును పోలీసు సిబ్బందిపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, హుస్సేనీ ఆలంకు చెందిన సైఫ్ అనే అనుమానితుడు తప్పించుకునే ప్రయత్నంలో తన వాహనాన్ని పోలీసులపైకి ఎక్కించాడు.

ఈ ఘటనలో హెచ్‌న్యూ కానిస్టేబుల్ మహేందర్(HC Constable Mahender) యాదవ్‌కు కాలు ఫ్రాక్చర్ కాగా, అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌లకు  గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారు ఎక్కించి పారిపోయిన నిందుతుడిని ఛేజ్ చేసిన హెచ్‌న్యూ పోలీసులు అఫ్జల్‌గంజ్ వద్ద పట్టుకున్నారు. కానిస్టేబుల్‌ మహేందర్‌ ఫిర్యాదుతో అబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలుగా అనుమానిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ఘటన జరిగింది. మాదకద్రవ్యాల నేరాలలో నిందితుడి ప్రమేయాన్ని, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను నిర్ధారించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.