27 July, 2026 | 12:18 PM

Breaking News

డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •  

జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి

27-07-2026 11:43 AM

బోథ్,జులై 27 (విజయక్రాంతి): నియోజకవర్గంలోని వివిధ జలపాతాలను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులు ఆస్వాదించే విధంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్యుతానంద రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని అయితే ఆదిలాబాద్ జిల్లా అందాలను విదేశీ పర్యాటకులకు సైతం పరిచయం చేసే విధంగా ప్రభుత్వంఎకో టూరిజం కింద పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. దట్టమైన అడవుల్లో సహజ సిద్ధంగా ఏర్పడ్డ రాతి నిర్మాణాలు, స్వచ్ఛమైన జలదారలు గిరిజన సంస్కృతి పర్యటకులందరికీ వసతులతో ఏర్పాటు చేయాల్సింది అన్నారు . 

 పొచ్చెర జలపాతం వద్ద పర్యాటకుల కోసం టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ,సెంటర్ వాకింగ్ టైల్స్ పార్కింగ్ ,త్రాగునీటి వసతి పరిశుభ్రమైన మరుగుదొడ్లు అత్యవసర వైద్య సేవలు సీసీటీవీ భద్రత డిజిటల్ సమాచార వ్యవస్థ వంటి మౌలిక వసతులను కల్పించాలని కోరారు.ప్రకృతికి హాని జరగకుండా రిసార్టులు క్యాంపింగ్ జోన్లు ట్రైబల్ కల్చర్ విలేజ్ గిరిజన హస్తకళ విక్రయ కేంద్రాలు ,తెలంగాణ సాంప్రదాయ వంటకాల ఫుడ్ పోర్టును, ట్రెక్కింగ్ మార్గాలు, ప్రకృతి వీక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.నియోజకవర్గంలోని కుంటాల గాయత్రి జలపాతాలతో పాటు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జైనథ్ ఆలయం  కడెం ప్రాజెక్టు బాసర జ్ఞాన సరస్వతి ఆలయం వంటి పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఆదిలాబాద్ నేచర్ అండ్ హెరిటేజ్ టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేయాలన్నారు.దీంతో రవాణా రంగం మెరుగుపడి స్థానిక యువతకు హోటల్లు, చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే ఆస్కారం ఉందని పేర్కొన్నారు.పర్యాటకం ద్వారా ప్రపంచానికి ఆదిలాబాద్ జిల్లా పరిచయం చేసే విధంగా ఉండాలని ఆయన కోరారు.