calender_icon.png 4 February, 2026 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా డే సమావేశంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ ప్రసాద్ సూచనలు

04-02-2026 01:51:55 AM

అన్నపురెడ్డిపల్లి, ఫిబ్రవరి, 3 (విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఈరోజు ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా డే సమావేశంలో జిల్లా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ  ప్రసాద్ మంగళవారం సందర్శించి, మండల పరిధిలో నిధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మండల పరిధి లో గర్భిణీలు అందరూ ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే కాన్పులు అయ్యేలాగా ప్రోత్సహించాలని తెలియజేసినారు తల్లి బిడ్డల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అలసత్వము వహించవద్దని తెలియజేశారు .

పిల్లలందరికీ 100 శాతం వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా అందించాలని, రక్తపోటు మధుమేహం వ్యాధిగ్రస్తులకు ప్రతినెల ఆశా కార్యకర్తల ద్వారా మందులు సరఫరా చేయాలని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు డే కేర్ సెంటర్  జిల్లా ఆసుపత్రిలో ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ప్రియాంక సిహెచ్‌ఓ సోమ్లా నాయక్, వాణి పబ్లిక్ హెల్త్ నర్స్ ఎస్తేర్ రాణి, హెల్త్ సూపర్వైజర్ ప్రకాష్ రావు మరియు ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.