04-02-2026 01:51:58 AM
మలక్‌పేట్ సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో సిల్వర్ జూబ్లీ వేడుకలు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): హైదరాబాద్ మలక్‌పేట్‌లోని సెయింట్ జోసె ఫ్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ‘అగ్ లూమినా ప్రతిభ ను ప్రకాశింపజేస్తూ, గొప్పదనాన్ని చాటుకుం టూ’ థీమ్‌తో హస్తినాపురంలోని జీఎస్‌ఆర్ కన్వెన్షన్స్‌లో రెండు రోజుల పాటు ఈ కార్యక్ర మం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్ ఎం. అని ల్‌కుమార్, తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ డా. వి.బాలకిష్టారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రతన్ టాటా ఇన్నోవేష న్ హబ్ సీఈఓ, ఐఏఎస్ అధికారి ధాత్రి రెడ్డి, ప్రిన్సిపాల్ యూ. ఏ.సుందరి పాల్గొన్నారు. 9వ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన ఏ విజన్ దట్ బికేమ్ ఎ లెగసీ అనే నృత్యనాటిక విశేషంగా ఆకట్టుకుంది. ఐసీఎస్ ఈ 2025 బోర్డు పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకా లు అందజేశారు. రెండు రోజుల అగ్ లూమి నా సిల్వర్‌జూబ్లీ సాంస్కృతిక ఉత్సవం అత్యంత వైభవంగా ముగిసింది.